Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైకోర్టు అడ్మినిస్ట్రేటర్‌ జనరల్‌గా సోమా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

హైకోర్టు అడ్మినిస్ట్రేటర్‌ జనరల్‌గా సోమా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ హైకోర్టు అడ్మినిస్ట్రేటర్‌ జనరల్‌, అఫీషియల్‌ ట్రస్టీగా ఇటీవల నియమితులైన ప్రముఖ న్యాయవాది ఎస్‌ శ్రీనివాసరావు(ఎస్‌ఎస్‌ రావు) శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేండ్ల పాటు ఈ పదవీలో ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఉన్న ”తెలంగాణ ప్రభుత్వ మహా ప్రశాసకుడు, అధికార ట్రస్టీ” కార్యాలయంలో శనివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా ఆయనను హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు. సమర్ధుడైన న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఎస్‌ ఎస్‌ రావుకు ప్రభుత్వం ఈ పదవి ఇవ్వడంపై అన్ని జిల్లాల న్యాయస్థానాల అధికారులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎస్‌ ఎస్‌ రావు హైకోర్టులో గత మూడు దశాబ్దాల నుంచి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -