నవతెలంగాణ-పాలకుర్తి
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి కుండి ఆదాయం 26 లక్షల 27 వేల 977 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. బుధవారం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం అనంతరం ఈవో మోహన్ బాబు మాట్లాడుతూ మార్చి 21 నుంచి అక్టోబర్ 8వరకు 201 రోజులలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ఆదాయాన్ని ఆలయం కళ్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ ఎన్ నిఖిల్ పర్యవేక్ష ణలో లెక్కించామని తెలిపారు. ఆలయ ఉండి లెక్కింపులో అమెరికా కరెన్సీ నోట్లు 32 (317 డాలర్లు), ఉగాండా 1(5000 సీలింగ్స్ ), ఇంగ్లాండ్ 1(5 పౌండ్స్), కొరియా 1(1000), యూరోపియన్ 1(10) యూరోలు వచ్చిన్నట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, ఆలయ సిబ్బంది. శ్రీసోమేశ్వర,రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు.
సోమన్న ఆలయ హుండీ ఆదాయం 26.27 లక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES