నవతెలంగాణ – నవాబుపేట
భూమి తన పేర చేయాలని తరచూ గొడవ పడుతున్న తండ్రిని కిరాతకంగా రోకలిబండతో తలపై కొడుకు కొట్టి చంపిన ఘటన మండల పరిధిలోని కామారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారం గ్రామానికి చెందిన చిలుకల కృష్ణయ్య (50) అనే వ్యక్తిని ఆయన కుమారుడు వెంకటేష్ శుక్రవారం తెల్లవారుజామున రోకలి బండతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపాడు. గతంలో తన భార్యను హత్య చేసి జైలుకెళ్లాడు.
ఏడాదిన్నర క్రితం జైలు నుంచి తిరిగి వచ్చాక తన కుమారుడైన వెంకటేష్ పేరుపై ఉన్న 30గుంటల భూమిని తన పేర చేయాలని తరచూ గొడవ చేస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున కూడా మృతుడు నిందితుడు వెంకటేష్ తో గొడవపడటంతో భరించలేక ఇంట్లో ఉన్న రోకలి బండ తీసుకుని కొట్టి చంపేశాడు. అంతటితో ఆగకుండా తన పెద్దనాన్నలైన చిలుకల చెన్నయ్య, సత్యనారాయణ లకు చెప్పి పరారయ్యాడు. మృతుని సోదరుడు చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.
తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES