- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని గొల్లాది గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి మామిడి సత్యం (62)ను అతని కుమారుడు రాము హత్య చేశాడు. మద్యానికి బానిసైన రాము శనివారం మధ్యాహ్నం తండ్రిపై పదునైన కత్తితో దాడి చేసి తలను నరికి చంపాడు. తండ్రి తల, మొండెం వేరవడం చూసిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై తారకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



