Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమంచి కంటెంట్‌తో 'సన్‌ ఆఫ్‌'

మంచి కంటెంట్‌తో ‘సన్‌ ఆఫ్‌’

- Advertisement -

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌’. బత్తుల సతీష్‌ దర్శకుడు. ఈ మూవీని ఈనెల 27న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో ట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌లో రైటర్‌, నిర్మాత కోన వెంకట్‌, సముద్ర, వి.ఎన్‌ ఆదిత్య, రామసత్యనారాయణరాజు, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రైటర్‌, నిర్మాత కోన వెంకట్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్‌ ఉన్న చిత్రాలు హిట్‌ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్‌ బత్తుల చెప్పిన ‘సన్‌ ఆఫ్‌’ కథ నాకు చాలా నచ్చింది.

యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. పాత్రలో పరకాయ ప్రవేశం చేశాను. భాస్కర భట్లతోనే ఈ కథ కోసం ఎక్కువగా చర్చించాం. అప్పుడే నాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రిషిని పరిచయం చేశారు. రిషి ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. కిట్టు గొప్ప విజువల్స్‌ను ఇచ్చాడు. శోభా అమ్మోరులా నా చేతిని పట్టుకుని మా సినిమాని ఇంత దూరం తీసుకు వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్‌, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్‌ నుంచి బయటకు వెళ్లలేరు’ అని హీరో, నిర్మాత సాయి సింహాద్రి అన్నారు. డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత శోభా రాణి మాట్లాడుతూ,”సన్‌ ఆఫ్‌’ అనే టైటిల్‌లోనే ఎంతో ఎమోషన్‌ ఉంది. సాయి నాకు చూపించిన ట్రైలర్‌ చూసి ఎంతో ఎమోషనల్‌ అయ్యాను. ఇది చాలా మంచి చిత్రం అవుతుందని అప్పుడే చెప్పాను. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీని అందరూ చూసి, సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -