Sunday, March 15, 2026
E-PAPER
Homeజాతీయంవిడుదల కానున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌

విడుదల కానున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌

- Advertisement -

ఆయనపై నిర్బంధాన్ని ఎత్తేయాలని కేంద్రం నిర్ణయం
ఆరు నెలల క్రితం అరెస్టయిన సామాజిక కార్యకర్త

న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ విడుదల కానున్నారు. ఆయనపై నిర్బంధాన్ని వెంటనే ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆరు నెలల క్రితం ఆయనను ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ఆయనను అరెస్టు చేశారు. లేహ్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అయితే లడఖ్‌లో శాంతి, స్థిరత్వం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో సోనమ్‌పై ఉన్న నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌ 24న లేహ్‌లో అల్లర్లు చోటుచేసుకున్న విషయం విదితమే. దాంతో అక్కడ శాంతి, భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద సెప్టెంబర్‌ 26న సోనమ్‌ను అరెస్టు చేశారు. లేహ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశాల ప్రకారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లడఖ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బంద్‌లు, నిరసనలో ప్రాంతం నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో హైపవర్‌ కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించనున్నట్టు చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -