నవతెలంగాణ – హైదరాబాద్
సాఫ్ట్‌వేర్ సప్లయి చెయిన్ సెక్యూరిటీలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ అయిన సోనాటైప్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తమ నూతన ఇండియా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం తెలంగాణ ప్రభుత్వ ఐటీ రంగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్ లాంచనంగా ప్రారం భించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేయడం, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ భద్రతను బలోపేతం చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యాలని సోనటైప్ సీఈఓ భగవత్ స్వరూప్ తెలిపారు. భగవత్ మీడి యాతో మాట్లాడుతూ.. ఇప్పటికే 100 మంది ఉద్యోగులను తీసుకున్నామని.. మరో ఎనిమిది, తొమ్మిది నెలల్లో రెట్టింపు ఉద్యోగులను తీసుకోనున్నామని చెప్పారు. ఇంజనీర్లు, ఉత్పత్తి నిపుణులు, ఏఐ పరిశోధ కులతో పనిచేసే ఈ హబ్ ప్రపంచవ్యాప్తంగా సోనాటైప్‌కు అతిపెద్ద ఆర్‌అండ్‌డీ కేంద్రంగా పని చేయనుందన్నారు. మీడియా సమావేశంలో సోనా టైప్ చీఫ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మిషెల్ జాన్సన్, సోనాటైప్ హెడ్ ఆఫ్ ఇండియా అండ్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ అభిషేక్ చౌహాన్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో సోనాటైప్ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -


