నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో పాటల పోటీలు, రచయితల సదస్సు ఉంటుందని తెరవే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్ శిక్షక్ , మోహన్ రాజ్ లు తెలిపారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో పాటకు సలామ్ కార్యక్రమాన్ని ఈ నెల 12 న శనివారం రోజు ఉదయం 10 – 30 గంటలనుంచి సాయంత్రం 4 – 30 వరకు కామారెడ్డి లోని కర్షక్ బిఇడి కళాశాలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యువతీ, యువకులు కళాశాల విద్యార్థులు పాటలు పాడవచ్చని, వర్క్ షాప్ లో పాల్గొన్న వారికి మొదటి మూడు బహుమతులు, పాల్గొన్న ప్రతివారికి సర్టిఫికెట్ అతిథుల ద్వారా ఇవ్వబడుతుందన్నారు.
ఒకరు ఒక పాట మాత్రమే పాడాలని, ఉద్యమ సామాజిక సందేశ జానపద పాటలకు మాత్రమే అవకాశం ఉంటుందని అన్నారు. తమ పేరును 9849062038 నంబర్ కు తేదీ 11లోపు నమోదు చేసుకోవాలన్నారు. యువకులు కళాశాల విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలన్నారు. ప్రసిద్ధ పాటల రచయితలు, ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, ప్రసిద్ధ కవులు అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమం మూడు సెషన్లుగా నిర్వహించబడుతుందని తెలిపారు. సాహితీ కళా ప్రియులు గాయని గాయకులు కళాభి మానులు పెద్దసంఖ్యలో హాజరు కావాలన్నారు.
12న పాటల పోటీలు.. రచయితల సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES