Saturday, October 25, 2025
E-PAPER
Homeసినిమాశ్రీలంకలో సాంగ్‌ షూటింగ్‌

శ్రీలంకలో సాంగ్‌ షూటింగ్‌

- Advertisement -

రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా దీన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పిస్తున్నాయి. తాజాగా కొత్త షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం శ్రీలంకకు బయలుదేరింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో అందమైన ప్రదేశాల్లో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌లపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు సానా అత్యంత ప్రెస్టీజియస్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో, ఇప్పటివరకూ ఎన్నడూ చూడని గెటప్‌లతో ప్రజెంట్‌ చేస్తున్నారు. రామ్‌చరణ్‌ ఈ పాత్ర కోసం కంప్లీట్‌ మేకోవర్స్‌ అవుతూ హై ఆక్టేన్‌ స్టంట్స్‌ చేయబోతున్నారు.

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ పెయిర్‌ సినిమాకి బిగ్గెస్ట్‌ అట్రాక్షన్‌. ఇక రామ్‌చరణ్‌ లుక్‌ ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ పవర్‌ఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోపాటు అలరించే సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమాల్లో మా ‘పెద్ది’ ఉంటుందనే నమ్మకంతో ఉన్నాం’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రం 2026, మార్చి 27న పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి నిర్మాత: వెంకట సతీష్‌ కిలారు, సహ నిర్మాత- ఇషాన్‌ సక్సేనా, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, డీఓపీ : ఆర్‌ రత్నవేలు, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -