రామ్‌చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా కోసం స్టైలిష్ మేకోవర్స్, పవర్‌ఫుల్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్, స్పెషల్ ట్రైనింగ్.. ఇలా అన్ని రకాలుగా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వడానికి తన బెస్ట్ ఇస్తున్నారు ఆయన. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు.
టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్, రామ్ చరణ్ మేకోవర్ ఫ్యాన్స్‌లో, సినిమా లవర్స్‌లో అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లాయి. ఇప్పుడు మేకర్స్ మైసూర్‌లో రామ్ చరణ్ మీద ఒక గ్రాండ్ సాంగ్ షూట్ స్టార్ట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌కి ఏఆర్ రెహ్మాన్ మ్యాసీవ్ సాంగ్‌ని అందించారు. వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో పిక్చరైజ్ అవుతున్న ఈ సాంగ్ కచ్చితంగా ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని, రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, గ్రేస్‌తో చేసిన మాస్ స్టెప్స్ ఈ సాంగ్‌ని హైలైట్‌గా నిలపడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన, సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: వద్ధి సినిమాస్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సంగీతం: ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్.
‘పెద్ది’ కోసం మైసూర్‌లో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్‌తో సాంగ్
- Advertisement -
- Advertisement -