Monday, November 3, 2025
E-PAPER
Homeదర్వాజపాట - పని…

పాట – పని…

- Advertisement -

పాట పాడుకుంటూ పని చేస్తున్నారు పొలాల్లో
అలసట అసలు తెలుస్తలేదు!
పొద్దు గుంకున్నది తెల్వటంలే!
పని ఒడుస్తలేదని అనిపిస్తలేదు శ్రామికులకు
ఇంకా పని చేయాలనిపిస్తున్నది మనసుకు!
సూర్యుడికీ అస్తమించాలని లేదు
పాట పాడుతూ పని చేసేవారిని
ఇంకా చూడాలనే ఉంది
సూర్యుడూ మరి శ్రామికుడే కదా అందుకే!
పని లేనిదే పాట పుట్టదు
పని శ్రామికంగా గానం అవుతున్నది
పాట పాడుతున్న వారి
పాదాలకు గండ పెండేరాలు లేవు
చేతులకు స్వర్ణ కంకణాలు లేవు
పట్టు శాలువాలు లేవు
పాదాలు బురద బురద
చేతుల్లో నాట్లు వేసే ఆకుపచ్చని వరి మొలకలు
స్వేద గంధంతో ఒంటి పైనున్న బట్టలు
పాట ఏ రచయిత రాసింది కాదు
పనిలోంచి ధ్వనించి ప్రపంచమైన పాట!!
పని పాట పంట!

  • కందాళైరాఘవాచార్య, 8790593638
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -