Saturday, December 20, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ ప్రభుత్వంపై మండిప‌డ్డ సోనియా గాంధీ..దేశ ప్రజలకు కీలక పిలుపు

మోడీ ప్రభుత్వంపై మండిప‌డ్డ సోనియా గాంధీ..దేశ ప్రజలకు కీలక పిలుపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రూపురేఖలనే ప్రభుత్వం మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లమంది రైతులు, కూలీల ప్రయోజనాలను దెబ్బతీశారని అన్నారు. గ్రామీణ పేదలను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని సీరియస్ అయ్యారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో కేంద్రం నల్లచట్టం తెచ్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ నల్లచట్టంపై పోరాటం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం.. లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మక చర్య.. పేదలకు జీవనాధారంగా ఉపాధి హామీ పథకం ఉంది.. గత 11 ఏళ్లుగా ఈ పథకాన్ని నీరుగార్చేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ పేదలకు ఇది జీవనాధారంగా మారిందని సోనియా గాంధీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -