Tuesday, December 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకల

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకల

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీ ఖాన్  ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీ ది అని అన్నారు. ప్రతీ పేదోడికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీ  ది అని గుర్తు చేసారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇసాక్, మోహన్ రెడ్డి, మాజీ జడ్పిటీసీ ఎర్ర చంద్రశేఖర్, సర్పంచ్ అభ్యర్థి జక్కు భూమేష్, పట్టణ అధ్యక్షులు దుమల్ల రమేష్, మాజీ జడ్పిటీసీ పంకజ, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇందయ్య, వామన్, హేమంత్ చారి, గంగన్న యాదవ్, రాజన్న యాదవ్, హన్మంత్ రావ్, గోపి సత్యనారాయణ, రాగుల శంకర్, మోసిన్ ఖాన్, రజాక్, ఇర్నాల గంగన్న, మంద రాజేష్, ప్రవీణ్, మౌలానా, సుధీర్, రాజ్ కుమార్, జగన్, నర్సింగ్ రావ్, ఐలవేని శ్రీను, శాహీన్, గంగాధర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -