Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో మంగళవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. మండల ప్రజల తరఫున సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు  తెలిపారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి రుణం తీర్చుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి  వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరు గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నూకల బుచ్చి మల్లయ్య, దూలూరి కిషన్ గౌడ్, పాలెపు చిన్న గంగారం, సింగిరెడ్డి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -