నవతెలంగాణ – కంఠేశ్వర్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపూల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆమె భర్త చనిపోయిన దుఃఖాన్ని కూడా ఆపుకొని దేశంలో పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అని,ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కూడా ఈనాడు అధికారం కోసం చూడలేదు. సోనియాగాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజుగారు ఎక్కువ కాలం కొనసాగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకురాలు అని, సోనియాగాంధీలు దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు వెళ్లడానికి తోడుపడుతున్నాయని, ఎల్లప్పుడూ పార్టీ కోసం శ్రమించే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సోనియా గాంధీ నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే ప్రోగ్రామింగ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానిగా రాహుల్ గాంధీ నిలబెట్టుకుంటామని నగేష్ రెడ్డి అన్నారు.
సోనియా గాంధీ చెరువు వల్లనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని సోనియా గాంధీ కి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఆయన అన్నారు. మరొకసారి జిల్లా సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం మోదీ నెహ్రూ కుటుంబం పై అసత్యపు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాటిని ఎల్లప్పుడూ కాంగ్రెస్ నాయకులు తిప్పికొడుతున్నారు.
అదేవిధంగా నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అంటే అది కేవలం సోనియాగాంధీ చొరవ వల్లనే అని, తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉంటారని, రాజీవ్ గాంధీ మరణాంతరం సోనియా గాంధీ పార్టీకి దేశానికి అండగా నిలబడి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేసిందని ఆయన అన్నారు. యూపీఏ చైర్ పర్సన్ గా ఆమె ప్రవేశపెట్టిన పథకాలు ఆర్టిఐ చట్టం ,ఆహార భద్రత చట్టం, విద్య హక్కు చట్టం లాంటివి ఎన్నో దేశ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆమె మన్మోహన్ సింగ్ని ఎన్నుకున్నారని, అధికారం కోసం ఎన్నటికీ ఆలోచించిన వ్యక్తి కాదు అని కేవలం ప్రజా సేవ కొరకు తన జీవితం అంకితం చేసిన మహానుభావురాలు సోనియా గాంధీ అని ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, ను చైర్మన్ కేశ వేణు,పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ,భక్తవత్సలం,జావీద్ అక్రమ్,రత్నాకర్,రామర్తి గోపి,విపుల్ గౌడ్,వేణు రాజ్,రాజా నరేందర్ గౌడ్ ,సేవాదళ్ సంతోష్,యాదగిరి,ఈసా,మఠం రేవతి,అబ్దుల్ ఎజాజ్ ,పోల ఉష,చంద్రకళ,లవంగ ప్రమోద్,సకినాల శివ కుమార్,అంతరెడ్డి విజయ్,పాల్ రెడ్డి,విజయ లక్ష్మీ ,సుజాత,ఆశబి,మాలిక బేగం,రాజేంద్ర ప్రసాద్ ,నరేందర్ గౌడ్ ,విజయ రాణి, స్వప్న, మీనా,షకీల్,ముస్తఫా,ఆదే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



