- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సంక్షోభ సమయంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దుబాయ్‌లో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతు సహాయం అందిస్తానని సోనూ సూద్ ప్రకటించారు. విమానాలు రద్దు కావడంతో దుబాయ్‌లో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన వెల్లడించారు. సహాయం అవసరమైన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించాలని, వారికి తక్షణమే సహాయం అందించేలా తన టీమ్ పని చేస్తుందని చెప్పారు.
- Advertisement -



