Magazines

రక్త రహదారి..!

52 నిమిషాల క్రితం

Blood-soaked Road..!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం



ఒకరి క్షణకాల నిర్లక్ష్యం,

ఉన్నట్టుండి రహదారిపై

మృత్యు శకట సంతకమై

కుటుంబాలను ఛిద్రం చేసింది..!

నిన్నకలలు కన్న కళ్ళు

లిప్తపాటులో చీకటై పోయాయి,

చక్రాల కింద శరీరాలే కాదు

ఎన్నో బంధాలు నలిగిపోయాయి..!

నల్ల నల్లని తారురోడ్డుపై

జారుతున్న ఎర్ర ఎర్రని రక్తం,

దారిని సింగారించే రంగు కాదు,

అది తిరిగిరాని ప్రాణాల సాక్ష్యం..!

మితిమీరిన వేగాన్ని తగ్గించుదాం, గమ్యంవైపు సజావుగా సాగిపోదాం,

ఎందుకంటే ప్రయాణ వేగంలో గెలవడానికి

జీవితం రక్త రహదారి కాకూడదు..!

డా. వాసాల వరప్రసాద్, 9490189847


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్