Magazines

రియల్ హీరో

58 నిమిషాల క్రితం

Real hero
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 2 నిమిషాల చదవడం


వెంకటరమణ హెడ్ మాస్టారు తొమ్మిదవ తరగతి గదిలోనికి ప్రవేశించగానే విద్యార్థులు తక్కువగా ఉండటం గమనించి “ఏమిట్రా ఇంత తక్కువగా వున్నారు."అంటూ ప్రశ్నించాడు.

మన పట్టణానికి ఆ హీరో వస్తున్న సందర్భముగా హీరో కట్ అవుట్ పెట్టి పాలాభిషేకం చేసి సుస్వాగతం పలికాడానికి సెలవుపెట్టారు" అన్నాడు అద్విక్

"అలాగా" బాధగా అన్నాడు వెంకటరమణ

"నిజంగా అతను గొప్ప హీరోనా సార్" అడిగాడు ప్రణవ్

"అసలు రియల్ హీరో ఎవరో తెలుసా" అన్నారు హెడ్ మాస్టర్.

"ఎవరు సార్ "

"ఆ హీరో కథ చెబుతాను వినండి. అదొక విమానం. ఆ విమానం. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలెట్లు వున్నారు.అందులో ఒక పైలట్ ఆ విమానాన్ని సమయం చూసి కూల్చివేయాలన్న వికృతమైన ఆలోచనలో వున్నాడు. సమయం చూసి అక్కడున్న కంట్రోల్ స్విచ్ ఒక్కొక్కటి ఆఫ్ చేయడం ప్రారంభించాడు."

"పక్కనున్న పైలట్ ఏంచేసాడు సార్ "అడిగాడు అద్విక్.

"ఆ పైలట్ గమనించి అడ్డుకోవడం చూసి వెంటనే కత్తితో అతనిని గాయం చేసాడు."

"అయ్యో, అప్పుడేమయింది సార్"అడిగాడు కృతిన్.

"తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్నప్పటికీ, విమానాన్ని కూల్చివేయకుండా అడ్డుపడి ప్రయాణికులను కాపాడాలన్న ఉద్దేశ్యంతో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. చివరకు విజయం సాధించాడు. శరీరంలో కత్తి దిగినా 174 మందిని కాపాడిన పైలట్.. రియల్ హీరో అంటూ మన ప్రధాని మోదీతో సహా ప్రపంచ నేతల పెద్దలు సెల్యూట్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు"

"మీరు చెప్పింది సినిమా కథ కాదా సార్ " అడిగాడు వినోద్.

"2026 సెప్టెంబర్ 30న జరిగింది. ఆ హీరో పేరు కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (Smit Machchhar) మన భారతీయుడు. దుబాయ్ విమానంలో తీవ్రంగా గాయపడినప్పటికీ 170కి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన 'రియల్ హీరో." అన్నాడు వెంకటరమణ

"మరి అలాంటి రియల్ హీరోకు పాలాభిషేకం ఎవరూ చేయలేదు" అన్నాడు అభి

"ఎవరూ చేయకుంటే ఏమిటి, మీరు అనుమతిస్తే మన బడిలో చేస్తాం సార్"అన్నాడు అంకిత్ .

"మన బడిలో చేయాలంటే నేను పైనుండి అనుమతి తీసుకోవాలి. కావాలంటే బడి బయట చేయడానికి ఎవరూ అభ్యన్తరం చెప్పరు"అన్నాడు వెంకటరమణ.

"సార్, ఈ రోజు మన తరగతిలో చాలామంది రాలేదు, మీరు అనుమతిస్తే ఆ ఏర్పాట్లు మేము చేస్తాము సార్ " అన్నాడు విహాన్

వెంకటరమణ కొన్ని క్షణాలు అలోచించి సరే నన్నట్లుగా తలాడించారు

“రియల్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ కట్ అవుట్ అంత పెద్దది చేయాలంటే ఎలాచేయాలి సార్ "అన్నాడు అద్విక్

“ఆయన కీర్తి ప్రతిష్టలు ఆకాశం ఎత్తుకు ఎదిగినప్పుడు అంత పెద్ద కట్ అవుట్ అనవసరం” అన్నారు వెంకటరమణ.

డిజిటల్ సెంటరుకు వెళ్లి అతని ఫోటోను మూడడుగులు ఎత్తులో ఉండేటట్లు తయారుచేయించారు .

‘రియల్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ గారికి పాలాభిషేకం’ అన్న బేనర్ తయారు చేశారు.

ఎవరూ ఉహించని రీతిలో ప్రజల స్పందన కలగడం చూసి హెడ్మాస్టర్ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు సినిమా హీరో వేడుకకు వెళ్లిన విద్యార్థులు కూడా అక్కడినుండి తిరిగి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూసి అందరూ సంతోషించారు

ఓట్ర ప్రకాష్ రావు, 09787446026

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్