మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చిన టీపీసీసీ చీఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిరింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనీ, దానితో లక్ష్మణ్ సామాజిక వర్గాన్నే అవమానించినట్టుగా వచ్చిన వివాదం నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాదలోని తన నివాసంలో ఆ ఇద్దరు మంత్రులతో భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి, సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ జోక్యంతో మంత్రుల మధ్య వివాదం సద్దుమణిగింది.
సమావేశంలో పొన్నం ప్రభాకర్ తాను అనుచితంగా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అనకపోయినా పత్రికల్లో వచ్చిన దానికి తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధపడినందుకు వ్యక్తిగతంగా క్షమాపణలు కోరారు. తనకు అలాంటి ఆలోచన లేదనీ, తాను ఆ ఒరవడిలో పెరగలేదన్నారు. కరీంనగర్‌లో తామంతా మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగినట్టు తెలిపారు. అలాంటి అపోహలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అనీ, ఆ పార్టీలో పుట్టి పెరిగిన తనకు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు అలాంటి సంస్కృతి నేర్పలేదన్నారు. ఇది సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భమని గుర్తుచేశారు. వ్యక్తిగత అంశాలు పక్కన పెడుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో అందరం కలిసి సామాజిక న్యాయం కోసం పోరాడుతామని తెలిపారు.
సారీ లక్ష్మణ్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES