- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతి రైతులపై జరుగుతున్న హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అమెరికాలోని మయామిలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో దక్షిణాఫ్రికా పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ దేశానికి రాయితీలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గతంలో దక్షిణాఫ్రికాలో జరిగిన సదస్సుల్లో అమెరికా ప్రతినిధులపై జరిగిన వ్యవహారాలను కూడా ఆయన తప్పుబట్టారు.
- Advertisement -



