- Advertisement -
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా సమం చేసింది. కీలక నాల్గో టీ20లో గెలుపొంది సిరీస్ ఫలితాన్ని నిర్ణయాత్మక మ్యాచ్‌కు తీసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో కివీస్‌పై సఫారీలు విజయం సాధించారు. దక్షిణాఫ్రికా తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. కానర్ (57), రూబిన్ (28 నాటౌట్), టోనీ (23) రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్ చతికిల పడింది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. రాబిన్సన్ (32), క్లీవర్ (26) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ (3/31), బార్ట్‌మన్ (2/30), సుబ్రయన్ (2/13), కేశవ్ (2/22) రాణించారు. బుధవారం ఐదో టీ20 మ్యాచ్ జరుగనుంది.
- Advertisement -



