- Advertisement -
కోల్‌కతా : న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ ఐపీఎల్ ప్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. నైట్‌రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన భరత్ అరుణ్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లగా.. టిమ్ సౌథీ ఆ స్థానంలోకి వచ్చారు. ‘టిమ్ సౌథీని నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ఆహ్వానించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈసారి అతడు బౌలింగ్ కోచ్‌గా వస్తున్నాడు’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకని సౌథీ.. కోచ్‌గానూ పని చేయటం మొదలెట్టాడు. ఇంగ్లాండ్‌కు సైతం సౌథీ బౌలింగ్ సలహాదారుగా పని చేశారు. కోచ్‌గా, ప్లేయర్‌గా కొనసాగే ట్రెండ్‌ను సౌథీ మొదలెట్టాడు.
- Advertisement -



