Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోయా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి

సోయా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
సోయా కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘం పెద్ద కోడప్ గల్ గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దారు అనిల్ ను భారతీయ కిసాన్ సంఘము సభ్యులు కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్ మాట్లాడుతూ… అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సోయా పంట కోతకు రావడంతో ముందస్తుగానే సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. సోయా కొనుగోలు కేంద్రాల్లో రైతుల సరిపడా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్ తో పాటు  మండల కార్యదర్శి ఓడి రాజు యాదవ్, మండల ఉపాధ్యక్షులు జైత్రం, బాన్స్వాడ డివిజన్ కిసాన్ సంఘం సభ్యులు దేవి సింగ్, రైతులు కృష్ణ జోషి శర్మ  రైతులు కృష్ణ జోషి శర్మ, విటల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -