Tuesday, November 11, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రైతులకు ఇబ్బందులు కల్గకుండా సొయా కొనుగోళ్లు కేంద్రాలు

రైతులకు ఇబ్బందులు కల్గకుండా సొయా కొనుగోళ్లు కేంద్రాలు

- Advertisement -

వ్యవసాయ సహకార సంఘం చెర్మన్ రేకుల గంగ చరణ్
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు తము పండించిన సొయాలు పంటలు ప్రభుత్వం కొనుగోలు కృషి చేసి రైతులకు మద్దతు ధర 5325ధరను అందించేందుకు కృషి చేస్తానని వ్యవసాయ సహకార సంఘం చేర్మెన్,రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ రేకుల గంగ చరణ్  అన్నారు. మంగళవారం మండలంలోని పల్సి  గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండేందుకు నూతనంగా మరో సోయా కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన  కళ్యాణ్ ఆధ్వర్యంలో  సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని రైతు సోదరులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రల  ద్వారా సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాడం జరిగిందని తెలిపారు. రైతులు వ్యవసాయ సహకార సంఘం సిబ్బందికి సహకరించి, రైతులకు అందించిన టోకెన్ల తేదీల ప్రకారం మార్కెట్కు తీసుకురావాలని కోరారు . అదేవిధంగా తమ పండించిన పంటలకు  తేమ 12 శాతం కంటే అధికంగా ఉండకుండా చూడలని తెలిపారు. ఈకార్యక్రమంలో పి ఏ సీస్ చెర్మన్ గంగా చరణ్ మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్,తహసీల్దార్ శివరాజ్, మండల నాయకులు పురం శెట్టి రావి కుమార్, దత్తహరి పటేల్, శ్రీరాముల రాజేష్, రమేష్ కొట్టె  హనుమల్లు,సహకార సంఘం కార్యదర్శి క్రాంతి కుమార్ రైతులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -