Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోయాపంట కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి

సోయాపంట కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

తహశీల్దార్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ – మద్నూర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే మద్దతు ధరతో సోయా పంట కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంట మద్దతు ధర క్వింటాలుకు రూ.5328 ప్రకటించడం జరిగిందని అన్నారు.

ప్రస్తుతం ప్రైవేటు దళారులు సోయా పంట కొనుగోళ్ళను రూ.4100తో కొనుగోలు జరుపుతూ సోయా పంట రైతులకు భారీ మొత్తంలో మోసగిస్తున్నారని తెలిపారు. రైతులకు జరిగే మోసాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని మండల తహశీల్దార్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తెప్ప వార్ తుకారాం, పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ పటేల్, పండిత్ రావు పటేల్, బాలకిషన్, ప్రశాంత్, బి హనుమాన్లు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -