Tuesday, October 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్భారీ వర్షానికి తడిసిన సొయా, పత్తి

భారీ వర్షానికి తడిసిన సొయా, పత్తి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలో ఆయా గ్రామాలలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో చేతికి వచ్చిన సొయా మరియు పత్తి పంటలు పూర్తిగా నీట మునగాయి. దింతో ఈ ఏడాదిముందుగానే రైతులు సరియైన సమయంలో అనుకూలంగా వర్షలు కురావడంతో మండలంలో ఉన్న అన్ని గ్రామాల రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రంలో పత్తి సొయా విత్తనాలను విట్టుకోవడం జరిగింది. ఈసారి పంటలకు సరియైన వర్షాలు కురావడంతో సొయా పత్తి మొలకులను  చూసి రైతులు మురిసిపోయారు. ఒక్కసారిగా సొయా పత్తి ఖాతా పుత దశలో మంచి వర్షలు కురావడంతో ఈ సారి మంచి దిగుబడులు వసాయన్న గంపేడు అశతో ఉండగా చివరిగా  సొయా కోత దశకు సమయంలో ఏకాదటిగా నెల రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షలు కురవడంతో రైతులకు మళ్ళీ నిరాశనే మిగిలిందని కంటి తడి పెట్టు కోవడం జరిగింది. దింతో కొందరు రైతులు వ్యవసాయ క్షేత్రంలో సొయా కోసి కుప్పలు వేయగా వర్షానికి పూర్తిగా తడిసి పోయాయి. తడిసిన సొయా కాయల్లో నుంచి మొలకలు రావడంతో పెట్టు బడులు కూడా నిడకుండా పోతున్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఎకరానికి దాదాపుగా 20నుంచి 30వేల వరకు ఖర్చు చేసి కూడా ఫలితం లేకుండా పోతుంది. దింతో ప్రభుత్వం పంట క్షేత్రాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని మండల రైతులు కోరుచున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -