Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ బ్రాంజ్ మెడల్స్ సాధించిన కానిస్టేబుల్‌ ను అభినందించిన ఎస్పీ 

 బ్రాంజ్ మెడల్స్ సాధించిన కానిస్టేబుల్‌ ను అభినందించిన ఎస్పీ 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : వరల్డ్ పోలీస్ , ఫైర్ గేమ్స్ – 2025 ( యు.ఎస్.ఎ )లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించిన కానిస్టేబుల్‌  మొహమ్మద్ బాబా ని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర శాలువలతో సన్మానించారు. వరల్డ్ పోలీస్, ఫైర్ గేమ్స్ – 2025 (యు.ఎస్.ఎ)లో షాట్‌పుట్ , 110 మీటర్ల పరుగు (35+ వర్గం)లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించిన కామారెడ్డి జిల్లా కానిస్టేబుల్ మొహమ్మద్ బాబాను, జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,  ప్రత్యేకంగా తమ చాంబర్‌లో సత్కరించి, హృదయపూర్వకంగా అభినందించారు. ప్రస్తుతం ఐ జి పి  స్పోర్ట్స్, హైదరాబాద్‌లో అటాచ్‌గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ బాబా , తేది: 27.06.2025 నుండి 06.07.2025 వరకు అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన తెలంగాణ రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి బ్రాంజ్ మెడల్స్ పతకాలు సాధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ .. మన కామారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్  మొహమ్మద్ బాబా ప్రపంచ స్థాయి పోటీల యందు రెండు  బ్రాంజ్ మెడల్స్ గెలవడం పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు. ప్రతిభావంతులు తమ ప్రతిభా పాటవాలు చాటడానికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తాము అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -