– సస్పెక్ట్ ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
– బాధితులతో గౌరవంగా వ్యవహరించి తక్షణ పరిష్కారం చేయాలి
– సిబ్బంది నీతి, నిజాయితీతో బాధ్యతయుతంగా తమ విధులను నిర్వర్తించాలి
– జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర..
నవతెలంగాణ – కామారెడ్డి
మాచారెడ్డి పోలీస్టేషన్ ను వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి సిబ్బంది అందరితో మాట్లాడారు. సిబ్బంది అన్ని విషయాల గురించి తెలియజేశారు. ఎస్పీ , ఎస్ఐ, సిఐ, ఏఎస్పి లకు తెలియజేసిన విషయాలు సిబ్బందికి అందరికి తెలిశాయా లేదా అని పరిశీలించరు. అనతరం పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్టేషన్లో రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్టేషన్ రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, పరిసరాలను పరిశీలించారు. పోలీస్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను మాచారెడ్డి ఎస్సై అనిల్ ని అడిగి తెలుసుకున్నారు.
బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించే దిశగా త్వరితగతిన సిబ్బందిని కేటాయించి బాధితులకు తగ న్యాయం చేయాలని సూచించారు. సస్పెక్ట్ ప్రతి కదలికపై నిఘా పెట్టాలని, నేరాల అదుపుకు పటిష్టమైన గస్తీ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సిబ్బందిని కేటాయించి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉంచాలని సూచించారు. దేవాలయాలు, ప్రార్థన స్థలాలు, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కి వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలని, ప్రతి సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
కామారెడ్డి నుండి సిరిసిల్లకు వెళ్లే స్టేట్ హైవే మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ఆదేశించారు. దుర్గా నవరాత్రి సందర్భంగా అవాంచనీయ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, పోలీసు బందోబస్తు, నైట్ పేట్రోలింగ్‌ను మరింత పెంచాలని సూచించారు.
విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లు తమ గ్రామాలను తరచూ సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు కలిగి నేరాల నివారణకు చురుగ్గా పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలను అరికట్టే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు సైబర్ సేఫ్టీపై సూచనలు ఇవ్వాలని, ప్రత్యేకంగా యువతలో సైబర్ అవగాహన పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీధర్, మచ్చారెడ్డి ఎస్‌హెచ్‌ఓ యస్ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.