Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జెండాను ఆవిష్కరించిన ఎస్పీ యం. రాజేష్ చంద్ర 

జెండాను ఆవిష్కరించిన ఎస్పీ యం. రాజేష్ చంద్ర 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి  ఎస్పీ క్యాంప్ ఆఫీస్, జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2, 2025న ఎస్పీ క్యాంప్ ఆఫీస్, జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  యం.రాజేష్ చంద్ర  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజల రక్షణ మరియు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి ప్రశంసనీయమైనది. పోలీస్ సిబ్బంది నిష్టతో, క్రమశిక్షణతో సేవలందించాల అని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరికీ గర్వకారణం అన్నారు.  సమాజములో శాంతి భద్రతలను కాపాడుకుంటూ,  ప్రతీ పోలీసు అధికారి   క్రమశిక్షణతో సేవలందిస్తూ జిల్లా పోలీస్ శాఖ ముందుకు వెళ్ళాలి  అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఏఆర్ డిఎస్పీ యాకుబ్ రెడ్డి, సి.ఐ లు, ఆర్ఐలు, ఎస్.ఐ లు, ఎస్సైలు, డిపిఓ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad