అధైర్య పడకండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది
నవతెలంగాణ – మద్నూర్
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతులాకుతులమవుతున్న మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల గ్రామాలకు వరద తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వరద బాదితులకు ప్రభుత్వం మద్నూర్, డోంగ్లి, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం సందర్శించి బాదితులకు ధైర్యాన్ని నింపారు. వరదల మూలంగా ఎలాంటి నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు కూడా అధైర్య పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డి.ఎస్.పి, బిచ్కుంద సీఐ, మద్నూర్ ఎస్సై, వీరితో పాటు మద్నూర్ తహశీల్దార్ ఎండి ముజీబ్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎస్పీ రాజేష్ చంద్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES