Thursday, May 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంస్పేస్ ఎక్స్.. రాకెట్ ప్ర‌యోగం విఫ‌లం

స్పేస్ ఎక్స్.. రాకెట్ ప్ర‌యోగం విఫ‌లం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు మ‌రో చేదు అనుభ‌వం ఎదురైంది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ రూపొందింన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ మళ్లీ ఫెయిల్ అయ్యింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజవంతంగానే దూసుకెళ్లింది. కానీ, అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. అయితే, స్టార్ షిప్ రాకెట్ ఇలా పేలడం వరుసగా ఇది మూడోసారి. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.36 గంటలకు టెక్సాస్‌ లోని బ్రౌన్స్‌విల్‌ తీరంలోని వేదిక నుంచి స్పేస్‌ఎక్స్ దీన్ని ప్రయోగించింది. రీయూజ్ చేసేందుకు వీలుగా అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలిదశలో బూస్టర్‌ ఈ రాకెట్‌ నుంచి విడిపోయి భూమికి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ, స్పేస్‌ఎక్స్‌ కంట్రోలర్స్‌కు బూస్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం.. నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా.. సముద్రంలో పడిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -