హీరో నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ‘ఆయా షేర్’ ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రం ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘ఆయా షేర్’ సాంగ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆయా షేర్ పాట ప్రోమో విడుదలైనప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ అందరికీ నచ్చింది. అనిరుధ్ నేను ఇచ్చిన పదాలు తీసుకొని జనాలకి రీచ్ అయ్యేవిధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. ఇంత ఫెరోషియస్ సాంగ్‌లో లిరిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు మరి ఏ పాట ఇవ్వలేదు. నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడే ఓ వ్యక్తి.. ఈ పాట విని ఒక కొత్త స్ఫూర్తి పొందానని చెప్పాడు. అలాంటి మెసేజులు చాలా వచ్చాయి. ఈ స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల్ వెనుక మంచి కథ ఉంటుంది. ఇప్పుడు అందరు కూడా జడలు వేసుకుని రీల్స్ చేస్తున్నారు. ఆ కల్చర్‌ని గుర్తు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అనిరుధ్ పాట చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొడుతున్నాం అని చెప్పారు. ఈ పాట సక్సెస్‌కి ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్. జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తిని ఇచ్చే క్రమంలో వచ్చిన పాట ఇది. ఇలాంటి పాట రాయటం నా అదృష్టం.
ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



