నవతెలంగాణ – ఆర్మూర్ : పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నేటి నుంచి నవంబర్ 25 తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు పరచాలని మండల విద్యాధికారి రాజా గంగారం గురువారం తెలిపారు .పట్టణంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు శుభ్రపరచుకోవడం, తరగతి గదులు శుభ్రపరుచుకోవడం, పాఠశాల ఎలక్ట్రిసిటీ వైరింగ్ ను చెక్ చేసుకోవడం, భవనం పైన చెత్తను తొలగించుకోవడం, మురికి నీరు పోవడానికి మార్గం సుగమం చేసుకోవడం, వంటగదిని శుభ్రం చేసుకోవడం, టాయిలెట్స్ పరిశుభ్రత, స్కూల్ గ్రౌండ్ లో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరచుకోవడo, తదితర అంశాలతో పాఠశాల లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు కోవాల్సిందిగాసూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.
పాఠశాల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
- Advertisement -
- Advertisement -


