Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి

ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి

- Advertisement -

సుప్రీంకోర్టు రోడ్‌ భద్రతా కమిటీ చైైర్మెన్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణలోని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దష్టి సారించాలని సుప్రీం కోర్టు రోడ్‌ భద్రతా కమిటీ ఛైర్మెన్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే అన్నారు. బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌లో తెలంగాణ ప్రభుత్వ సీనియర్‌ అధికా రులతో రోడ్‌ సేఫ్టీపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రోడ్డు ప్రమాదాలు, మరణాల పెరుగుదలను అరి కట్టేందుకు ఏర్పాటైన కమిటీ, రోడ్డు భద్రతా చట్టాల అమలుపై పర్యవేక్షణ చేస్తూ, రాష్ట్ర విధానాలను సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సామాజిక, ఆర్థిక ప్రభావం నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యంతో కమిటీ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా రోజుకు 500 మంది, గంటకు 25 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తు న్నారని చెప్పారు. గణాంకాల ను ప్రస్తావిస్తూ, ”ప్రమాదాలు దేవుడి చిత్తం కాదు, అవి నివారించ గలిగేవి, తప్పించుకోగలిగేవి” అని వాఖ్యానించారు. మరణాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు రాష్ట్రంలో చేపట్టిన చర్యలను వివరించారు. అలాగే హోంకార్యదర్శి రవిగుప్తా తెలంగాణ రోడ్డు భద్రత పట్ల తీసు కుంటున్న చర్యలను వివరించారు. డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ ట్రాఫిక్‌ నియంత్రణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిటిక్స్‌ వాడకాన్ని వివరించారు.

ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు, ప్రమా దాలు, మరణాలు, గాయాలు తదితర వివరాల ను వివరించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా పాఠశాల్లో రోడ్డు భద్రతా పాఠ్యాంశాలను చేర్చుతున్నట్టు తెలిపారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డులో భద్రతా చర్యలను వివరించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ గ్రేటర్‌ పరిధిలో ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్ల తొలగింపు, గుంతల పూడిక, లేన్‌ మార్కింగ్‌, సైన్‌ బోర్డుల ఏర్పాటు వంటి ఇంజినీరింగ్‌ చర్యలను వివరించారు. 2025 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి, రవాణా శాఖ మంత్రితోపాటు ఇతర మంత్రుల భాగస్వామ్యంతో జిల్లాలోని రోడ్డు భద్రతా మాసం నిర్వహించిన విషయం చైర్మెన్‌కు తెలియ జేశారు. అలాగే ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు, రోడ్డు భద్రతా క్లబ్‌లు, ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ పార్కులు, రంగోలి, క్విజ్‌ పోటీలు, ప్రతిజ్ఞ, వ్యాస రచన పోటీలు వంటి కార్య క్రమాలకు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలలో విస్త్రృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో ఎనిమిదో స్థానం, మరణాలలో పదో స్థానం దక్కిం దని సంబంధిత అధికారులు తెలిపారు. హెల్మెట్‌, సీటు బెల్ట్‌ వాడకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్‌ వాడకం, అధిక వేగం ప్రధాన కారణాలని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, కుటుంబ పోషకులు ఎక్కువగా ప్రభావి తమవుతున్నారనీ, అవగాహన కార్యక్రమాలను మరింతగా పెంచాలని ఛైర్మెన్‌ సూచించారు.

తెలంగాణలో చేపట్టిన చర్యలపై సంతప్తి వ్యక్తం చేసిన ఛైర్మెన్‌ సప్రే భవిష్యత్తులో వ్యక్తిగతంగా సందర్శించి అమలు స్థితిని పరిశీలిస్తానని అన్నారు. ఉత్తమ పద్ధతులను ఇతర రాష్ట్రాలతో పంచుకోవాల నుకుంటున్నట్టు తెలిపారు. అలాగే అభివృద్ధి పరంగా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రశంశించారు. రోడ్డు భద్రత పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. ప్రజల ప్రాణాలను రక్షించ డంలో సుప్రీం కోర్టు కట్టుబాటును ఆయన మరోసారి తెలియజేశారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌అండ్‌బీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, ముఖ్యకార్యదర్శి ఇలంబర్తి, టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ డాక్టర్‌ సాంగీత, ఐజీ రైల్వే, రోడ్డు భద్రత రమేశ్‌ నాయుడు, జాయింట్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ జోయెల్‌ డేవీస్‌, జిల్లా కలెక్టర్‌ హరి చందన దాసరి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్‌, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ ఎన్‌ అశోక్‌, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad