జిల్లా కలెక్టర్ ఎం.హరిత
ప్రజావాణికి 81 దరఖాస్తులు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ ఎం.హరిత దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 81 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 48, పంచాయితీ రాజ్ శాఖకు 11, ఎస్పీ కార్యాలయానికి 5, ఉపాధి కల్పనాశాఖకు 4, సిరిసిల్ల మున్సిపాలిటీ, విద్యా శాఖకు 3 చొప్పున, పౌరసరఫరాలు, మత్స్య, వైద్యారోగ్య, రవాణా, సంక్షేమ, వేములవాడ మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ కు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES