Wednesday, April 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పారిశుద్ధ్య పనుల్లో  ప్రత్యేక దృష్టి సారించాలి: ఎంపీఓ భీమేష్

పారిశుద్ధ్య పనుల్లో  ప్రత్యేక దృష్టి సారించాలి: ఎంపీఓ భీమేష్

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
గ్రామాల్లో పారిశుధ్య పనులను  ఎప్పటికప్పుడు పరిశీలించి  గ్రామాలను సస్యశ్యామలంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి  మండల పంచాయతీ అధికారి  భీమేష్ ఆదేశించారు. బుధవారం మండలంలోని కలిసి గ్రామాన్ని  సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో  నర్సరీలు, సెక్రిగేషన్ షెడ్డు ,డంపింగ్ యార్డ్, ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని  నర్సరీలో పెంచే మొక్కలను  ఎండిపోకుండా పల జాగ్రత్తలు  తీసుకోవాలని  సూచించారు. అనంతరం గ్రామపంచాయతీకి సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దయవరి సత్యవ్వ ఉప సర్పంచ్ పంచాయతి కార్యదర్శి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -