డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వినోద్
నవతెలంగాణ – డిచ్ పల్లి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలిస్ సిబ్బంది విధుల పట్ల అంకితభావం కలిగి ఉండాలని, ఎన్నికల సమయంలో ప్రత్యేక దృష్టి సారించాలని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వినోద్ సూచించారు. సోమవారం డిచ్ పల్లి సర్కిల్ పరిధిలోని ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ లో సిబ్బంది తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కె వినోద్, ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జీ సందీప్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలిస్ సిబ్బంది వ్యవహారించే తీరుతెన్నులపై సిబ్బందికి సూచనలను అందజేశారు.గ్రామ పోలీస్ అధికారి గ్రామాల నుంచి ఎప్పటి కప్పుడు సమాచారం సేకరిస్తూ ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో పోలీసుల విధులు, నియమావళి, ఎలక్షన్ కోడ్ వెలువడిన వెంటనే పోలీసుల విధుల పై సూచనలు అందజేశారు. ఏది జరిగిన వెంటనే తమపై అధికారికి సమాచారం అందజేస్తూ ఉండాలని పేర్కొన్నారు.
మత్తుపదార్థాలు, సైబర్ క్రైమ్స్ పై విద్యార్థులకు అవగాహన ..
డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వినోద్ , ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జి సందీప్ సిబ్బందితో కలిసి గన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులతో మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు మత్తు మందుకు బానిస కావద్దని, సైబర్ క్రైమ్స్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజు జరుగుతున్న విషయాలపై విద్యార్థులకు వివరిస్తూ తమ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఆ విషయాలపై అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు చూడాలన్నారు. మత్తుతో కుటుంబాలు రోడ్డున పడతాయని మద్యం సేవించి వాహనాలు నడిపి లెని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశాల్లో పోలీస్ సిబ్బంది అధ్యాపకులు పాల్గొన్నారు.