- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక సంచులను తయారు చేయించింది. ఇప్పటి వరకు వస్తున్న గోనె సంచులను ఇకపై నిలిచిపోనున్నాయి. ‘రేషన్ కార్డుపై అందరికీ సన్నబియ్యం.. ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం’ అనే కొటేషన్‌ను ఆ సంచిపై ముద్రించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఫొటోలతో రూపొందించింది. ఈ బ్యాగులోనే ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.
- Advertisement -