- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలం తుంగపాడు నందు గల మోడల్ స్కూల్ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఆటోలలో గుంపులుగా వెళ్తున్న విద్యార్థులను అటుగా వెళ్తున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చూసి ఆటో నీ ఆపి విద్యార్థులతో మాట్లాడారు. వెంటనే మిర్యాలగూడ అర్ టిసిడిఎం కు ఫోన్ చేసి శుక్రవారం నుంచి ఉదయం 8:30 వరకు మిర్యాలగూడ బస్టాండ్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మోడల్ స్కూల్ వద్దకి వెళ్లి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి రేపటి నుంచి ఉదయం మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
- Advertisement -



