Monday, January 26, 2026
E-PAPER
Homeజిల్లాలుఆత్మకూరు నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు

ఆత్మకూరు నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు

- Advertisement -

ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ జ్ఞానేశ్వర్..
నవతెలంగాణ – ఆత్మకూరు 

ఆత్మకూరు మండల కేంద్రం నుండి మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. రాణిగంజ్ డిపో ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్ స్టేషన్ వద్ద సోమవారం బస్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా క్యాంప్ నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎంపీడీవో మాట్లాడుతూ..ఆత్మకూరు మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అసిస్టెంట్ మేనేజర్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ఆత్మకూరు నుండి మేడారానికి 25 బస్సులను నడుపుతున్నాం. టీజీఎస్‌ఆర్‌టీసీ తరపున మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సులు సమకూర్చుతామని తెలిపారు. ఆత్మకూరు నుండి మేడారానికి పెద్దలకు రూ.210, పిల్లలకు రూ.130 టికెట్ ఛార్జీలు గా ఉన్నాయి. జాతర కు వెళ్ళే భక్తులు విలువైన ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. ఆత్మకూరు పాయింట్ వద్ద ఆర్టీసీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటాం అని తెలిపారు.

ఆత్మకూరు ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వాడుకోవాలని కోరారు, మరిన్ని వివరాలకు 9866820135కు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాణిగంజ్ డిపో తరపున ఇన్‌చార్జ్ డీఎంఏ శ్రీధర్, అసిస్టెంట్ మేనేజర్ ఆర్. జ్ఞానేశ్వర్, ఏడీసీ నాగిరెడ్డి, ఏడీసీ మల్లయ్య, సీఆర్‌సీ ధర్మేందర్, రాణిగంజ్ బృందం రామచంద్ర, వేణుమాధవ్, ఏఎల్కే రెడ్డి, సీఎస్ రెడ్డి, సతీష్, సాయి ప్రసాద్, సందీప్, అభిలాష్, వెల్ఫేర్ మెంబర్ గోపాల్, ఏడీసీ దాసు, ఆత్మకూరు పాయింట్ నిర్వహణ అధికారి వేణు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -