Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడల్ సోలార్ విలేజ్ స్కీంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం 

మోడల్ సోలార్ విలేజ్ స్కీంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
జిల్లాలోని చల్వాయి,పస్రా,గోవిందరావుపేట మరియు గ్రామపంచాయతీ కార్యాలయములలో గురువారం మోడల్ సోలార్ విలేజ్ స్కీం పై ప్రత్యేక ప్రచార కార్యక్రమం, అవగాహన సదస్సు నిర్వహించబడింది. అధికారులు గ్రామ ప్రజలకు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, లబ్ధి పొందే విధానాలు వివరించగా, ప్రజలు అడిగిన సందేహాలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానములు ఇచ్చారు. గ్రామ ప్రజల్లో సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ములుగుజిల్లాలో 5000 గ్రామ జనాభా కలిగిన ములుగు, గోవిందరావుపేట, చల్వాయి, పస్రా, వెంకటాపూర్, ఏటూరునాగారం, కమలాపూర్ మరియు వెంకటాపురం గ్రామాలను కలెక్టర్  అధ్యక్షతన గల జిల్లా స్థాయి కమిటీ మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ లో పోటీకి ఎంపిక చేయడం జరిగింది.

మోడల్ సోలార్ విల్లెజ్ స్కీం లో ఉన్న గ్రామాలలో ఏర్పాటు చేయబడిన పునరుత్పాదక శక్తి సామర్థ్యం అంచనా వేస్తారు మరియు  ఆ గ్రామాలలో అత్యధిక సోలార్ సామర్థ్యం ఉన్న గ్రామాన్ని ఆ జిల్లాకు మోడల్ సోలార్ గ్రామంగా ఎంపిక చేస్తారు. తద్వారా ఆ గ్రామానికి ఒక కోటి రూపాయలు సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్షన్  ద్వారా అందించబడుతుంది. ఈ సమావేశంలో  రాజేందర్, డిస్టిక్ మేనేజరు, టి జి ఆర్ ఈ డి సి ఓ , శ్రీ అఖిల సబ్ ఇంజనీర్ ఎన్పీడీసీఎల్ పస్రా ,  నవీన్ కుమార్ యాదవ్,ఫీల్డ్ ఆఫీసర్ టి జి ఆర్ ఈ డి సి ఓ  చల్వాయి,పస్రా,గోవిందరావుపేట పంచాయతీకార్యదర్శులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -