Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటాలీవుడ్‌లో సమస్యలపై ప్రత్యేక కమిటీ

టాలీవుడ్‌లో సమస్యలపై ప్రత్యేక కమిటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల థియేటర్ల బంద్ వివాదం, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తదితర పరిణామాలపై తాజాగా ఓ కమిటీ ఏర్పాటైంది. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం సూచించేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి మొత్తం 30 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనుండగా.. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -