Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ నగర్ లో తాగునీటి పై స్పెషల్ డ్రైవ్

అంబేద్కర్ నగర్ లో తాగునీటి పై స్పెషల్ డ్రైవ్

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా అంబేద్కర్ నగర్ గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎంపీఓ గౌస్ హైమద్ పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారించడానికి ముందస్తుగా ఒక బోరు వేసి దానిని కుళాయిలకు కనెక్షన్ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించిన రికార్డులను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గబ్బర్ సింగ్ పరిశీలించారు. ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటి అందించాలని ఆయన గ్రామ కార్యదర్శి సునీల్ యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవ వాగ్నేర్, ఉప సర్పంచ్ దేవులే వందన, పాలకవర్గ సభ్యులు, జాదవ్ శంకర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -