అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిలోఫర్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నిలోఫర్ ఆస్పత్రిలో అన్ని విభాగాలను పటిష్టపర్చాలని దిశానిర్దేశం చేశారు. నిలోఫర్‌లో నూతన భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిలోఫర్ ఆస్పత్రి, ఆరోగ్యశ్రీ ట్రస్టుపై మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పీజీ విద్యార్థులకు ఆస్పత్రిలో హాస్టల్ వసతి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగుల సహాయ కులకు వసతి కల్పించాలని సూచించారు. రోగులకనుగుణంగా సిబ్బందిని నియమించాలని కోరారు. ఓపీ, ఐపీ వైద్య సేవలందిస్తున్న ఆస్పత్రుల భవనాల పరిస్థితులపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, టీజీఎంఎస్‌ఐడీసీ వీణ, ఫణిందర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, అదనపు డీఎంఈ డాక్టర్ వాణి, నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ విజరుకుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
నిలోఫర్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES