Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించింది: ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ 

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించింది: ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
పంచాయతీ కార్యదర్శులు ఎవరూ ఎంపీడీఓ అనుమతి లేకుండా మండలం వదిలిపెట్టి వెళ్ళకూడదని,అనుమతి లేకుండా ఎవరైనా వెళ్తే వారు తదుపరి రోజున జిల్లా పంచాయతీ అధికారికి, డివిజన్ పంచాయతీ అధికారికి రిపోర్ట్ చేసి సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది అని ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం పనులను, ఆసుపత్రులను పర్యవేక్షించారు.

ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఆసన్నం అయినందున ఎవరూ పంచాయితీ ని విడిచి వెళ్ళ రాదని డీపీఓ చంద్రమౌళి ఆదేశించారని తెలిపారు.     కావున అట్టి పరిస్థితులను తీసుకొని రావద్దు అని, గ్రామ పంచాయతీలలో ముమ్మరంగా శానిటేషన్ పనులు చేయించి ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణకు చర్యలు తీసుకుని,పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయవలసిందిగా, నీరు సరఫరా అయ్యే దగ్గర ఎక్కడ కలుషితం కాకుండా చూడాలని,రోడ్డుకు ఇరు పక్కల సీసాలు,ప్లాస్టిక్ వస్తువులు ఏమీ ఉండకుండా చూడాలని, వాటిని డంపింగ్ యార్డ్ కి చేర్చి సెగ్గేషన్ చేయాల్సిందిగా  ఆదేశించారు. పంచాయతీ సెక్రెటరీ లు చేసే ప్రతీ పనినీ పనికి ముందు రెండు ఫోటోలు ఫైల్ చేసి ఉంచుకోవాలని, బిల్లు పేమెంట్ చేసే సమయంలో ఆ ఫైల్ ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు. ఈయన ఈజీఎస్ ఏపీవో రామచంద్రరావు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad