నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణములో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 10 వాహనములను సీజ్ చేశారు. వాహనముల పత్రాలు లేని అధిక లోడ్ తీసుకువెళుతున్న వాహనాలను సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో టాక్స్ కట్టకుండా ఫిట్నెస్ లేకుండా , బీమా పత్రాలు పొల్యూషన్ సర్టిఫికెట్. పర్మిట్ లను వాహనమునకు సంబంధించి అన్ని పత్రాలను వాహనం వెంట పెట్టుకోవాలని వారు పేర్కొన్నారు. ఎవరైతే టాక్స్ కట్టకుండా రోడ్డుపై వాహనములను తిప్పిన వారి వాహనములకు 200% అపరాద పన్నుతో టాక్స్ కట్టవలసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా వ్యక్తిగతంగా వాడే ద్విచక్ర వాహనములు మరియు కార్లు వాటి కాల పరిమితి మొదట తీసుకున్న సంవత్సరం నుండి 15 సంవత్సరముల వరకు ఉంటుందని తెలిపారు.
ఇలా 15 సంవత్సరములు దాటిన సొంత వాహనములు గ్రీన్ టాక్స్ చెల్లించి 5 సంవత్సరాలు వాహనం లను పునరుద్ధరించుకోవాలనీ అధికారులు వివరించారు. లేనట్లయితే సొంతానికి వాడుకొనే ద్విచక్ర వాహనాలు,కార్లు సీజ్ చేస్తామని తెలిపారు.అలాగే ప్రతీ వాహనము కు ముందు వెనుకాల ఒరిజినల్ రెడియం స్టిక్కర్స్ అతికించుకోవాలని, ట్రాక్టర్ ట్రైలర్ వాహనములకు రెడియం తప్పని సరిగా ఉండాలన్నారు రెడియం లేని వాహనాలకు 1000 రూపాయల నుండి 2000 రూపాయల వరకు జరిమాన విధిస్తామని తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం ఉంటాయన్నారు. తనిఖీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మోటారు వాహనముల తనిఖీ అధికారి గంధం వంశీధర్, సహాయక మోటారు వాహనముల అధికారి పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక తనిఖీలు… 10 వాహనాలు సీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES