తాడ్వాయి ఎంపీడీవో సుమన వాణి
నవతెలంగాణ – తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మండలాభివృద్ధి కార్యాలయంలో రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, వరదలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శనివారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మండలంలోని మెడికల్ ఆఫీసర్లు సబ్ ఇన్స్పెక్టర్ తాసిల్దార్, మిగతా అన్ని శాఖల అధికారులు హాజరై ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష సమావేశం ఉంటుందని అందరు హాజరుకావాలని ఎంపీడీవో సుమన వాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం సీజనల్ వ్యాధులు వరదల తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల పై ప్రత్యేక అధికారి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
రేపు సీజనల్ వ్యాధులపై ప్రత్యేక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES