నవతెలంగాణ – జుక్కల్
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశానుసారంగా వార్షిక తనిఖీలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ దాసరి వడ్డెన్న శనివారం జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరు శాతం, అధ్యాపకుల హాజరుశాతాన్ని ఆయన పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు ప్రతిరోజు కళాశాల వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా కళాశాల రిజిస్టర్స్, సైన్స్ ల్యాబ్స్ ను కూడా పరిశీలించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, చక్కగా చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూ.కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



