- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 17న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 22న సోమవారం నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి డోంగ్లి మండలంలోని 13 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆ మండల ఎంపీడీవో జగదీష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మండలంలోని గ్రామపంచాయతీల పరిధిలో ఈనెల 22న ఉదయం 10 గంటలకు ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ద్వారా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఏఏ గ్రామపంచాయతీకి ఎవరెవరు అధికారులు నియమించారనేది ఒక పట్టిక ద్వారా ఎంపీడీవో తెలియజేశారు.
- Advertisement -



