నవతెలంగాణ – జమ్మికుంట : మనదేశంలోని భారత సైనిక త్రివిధ దళాలకు మద్దతుగా , క్షేమార్థం కోసం భగవద్ అనుగ్రహం కొరకు జమ్మికుంట లోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా 108 లీటర్ల ఆవుపాలతో, 108 కొబ్బరికాయలతో ఆలయ అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్నపూర్ణ సేవా సమితి , భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు మాట్లాడారు. ఇది యుద్ధం కాదని, ధర్మం కోసం దేశ గౌరవం కోసం పోరాటమని తెలిపారు. మన ఐక్యత ,మన దేశభక్తి ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు. పాకిస్తాన్ కు భారతదేశం ఏంటో స్పష్టంగా చెప్పే సమయం వచ్చిందని, భారత్ ఏకమైతే ఎంత శక్తివంతమైందో చూపే సమయం వచ్చిందన్నారు. మన త్రివిధ దళాల సైనికులకు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి మరింత శక్తి యుక్తులను వారికి ప్రసాదించి, ఉగ్రమూకులను తుద ముట్టించి భారతదేశం విజయపతానికి దూసుకెళ్లాలని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆ విశ్వేశ్వర స్వామిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన పుర ప్రముఖులు, అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు , భవాని భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భారత సైనిక త్రివిధ దళాలకు మద్దతుగా ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -